కరోనా వైరస్ సోకిన వారికి చికిత్సందించే వైద్యులు, నర్సులను సైతం రాకాసి వైరస్ వదలట్లేదు. నన్ను తరిమి కొట్టేందుకు ప్రయత్నిస్తారా ? మీ పని పడతా అంటూ దైవంలా భావించే వైద్యులు, నర్సులు, ఇతర మెడికల్ సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరులో తొలి కరోనా కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఓ మహిళ హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది.

Also Read : ఈ ఏడాది విద్యార్థులకు..వచ్చే ఏడాది నేరుగా తల్లుల ఖాతాలోకే..

మహిళకు కరోనా లక్షణాలుండటంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నీలోఫర్ లో తొలి కరోనా కేసు కావడంతో మిగతా వైద్యులకు కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. బాధిత నర్సును సోమవారం రాత్రి గాంధీకి తరలించారు. మహిళ సొంతూరు అయిన ప్రొద్ధుటూరులో అధికారులు శానిటైజ్ చేశారు. బాధిత మహిళ కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్ కు తరలించారు. ఇంకా వారితో ఎవరైనా సన్నిహితంగా మెలిగారా ? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read :వసతి దీవెన..విద్యా దీవెన..జగనన్న విద్యాదీవెన

రాణి యార్లగడ్డ

Next Story