కొత్త లుక్ తో మంటపుట్టిస్తున్న విజయ్ దేవరకొండ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jan 2020 2:01 PM GMT
కొత్త లుక్ తో మంటపుట్టిస్తున్న విజయ్ దేవరకొండ

  • ఫైటర్ సినిమాతో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అరంగేట్రం
  • పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం
  • ఛార్మి, కరన్ జోహార్ ఈ కొత్త సినిమాకు నిర్మాతలు
  • తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో షూటింగ్
  • పూర్తిగా ముంబైలో అండర్ వరల్డ్ నేపధ్యంలో షూటింగ్
  • పూర్తి స్థాయిలో సినిమాకోసం బాడీ వర్కవుట్ చేస్తున్న విజయ్
  • చొక్కా లేకుండా కనిపించే సన్నివేశాలు, భారీ స్థాయి పోరాటాలు
  • బాలీవుడ్ టాప్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీం మేకోవర్
  • కొత్త లుక్ తో మంటపుట్టిస్తున్న విజయ్ దేవరకొండ

తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న నవతరం స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నాడు. పూరీ జగన్నథ్ డైరెక్షన్ లో , ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్న ఫైటర్ సినిమాతో హిందీసినిమాల్లోకి అడుగుపెడుతున్న విజయ్ ఈ సినిమాకోసం పూర్తి స్థాయిలో మేకోవర్ చేయించుకున్నాడు.

బాలీవుడ్ టాప్ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీం ఈ కొత్త సినిమాకోసం విజయ్ దేవరకొండ లుక్ ని పూర్తిగా మార్చేశాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ కొత్త సినిమా షూటింగ్ పూర్తిగా మాఫియా బ్యాగ్రాండ్ లో ముంబైలో జరుగుతుంది.

విజయ్ ఈ సినిమాకోసం లుక్ తోపాటుగా మొత్త బాడీ స్ట్రక్చర్ ని కూడా మార్చేసుకుంటున్నాడు. కెమెరా ఎదురుకుండా చాలా రఫ్ గా కనిపించే డాన్ లా కనిపించేందుకు, ఫైటర్ గా కనిపించేందుకు చొక్కాలేకుండా కూడా నటించే సన్నివేశాలకోసం గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు.

అలీమ్ హకీం గతంలో టాప్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్ లకుకూడా మేకోవర్ చేసిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయి యాక్షన్ ఫిల్మ్ లో రఫ్ గా, మాస్ గా కనిపించే రీతిలో ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ లుక్ ని హకీం అమాంతంగా మార్చేసినట్టుగా తెలుస్తోంది.

Next Story
Share it