మీకు విజయ్‌ దేవరకొండను కలవాలని ఉందా..? ఈ నెంబర్‌కు కాల్ చేయండి..

సోషల్ మీడియాలో హీరో విజయ్ దేవరకొండ పేరుతో నకిలీ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి.. అమ్మాయిలను ట్రాప్‌ చేస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి మాత్రం విజయ్ దేవరకొండ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడమే కాకుండా, ఆ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. విజయ్ దేవరకొండను కలవాలంటే సదరు నెంబర్ కు కనెక్ట్ అవ్వాలంటే ఓ నెంబర్ ను ఇచ్చారు.

ఈ ప్రొఫైల్ ను గుర్తించిన విజయ్.. సోషల్ మీడియాలో తప్పుడు వ్యక్తులను గుర్తించేందుకు విజయ్ మేనేజర్.. ఓ అమ్మాయిగా సదరు వ్యక్తితో చాట్ చేశాడు. దీంతో తప్పుడు సమాచారంతో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించిన మేనేజర్.. తగిన ఆధారాలతో ఈ నెల 3న సీసీస్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడు.

ఆయన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి ఫేస్ బుక్ ఐడి, మొబైల్ నెంబర్ ఆధారంగా అతన్ని బాన్సువాడ మిర్జాపూర్‌ గ్రామానికి చెందిన సాయికిరణ్‌గా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని హైద్రాబాద్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. అతన్ని విచారించిన అనంతరం 41A సీఆర్పీసి కింద నోటీసులు జారీ చేసినట్లు ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

Vamshi Kumar Thota