Fact check: నిజమెంత: నిరసనకారులు వైట్ హౌస్ మీద దాడిచేశారా..?

By సుభాష్  Published on  5 Jun 2020 6:53 AM GMT
Fact check: నిజమెంత: నిరసనకారులు వైట్ హౌస్ మీద దాడిచేశారా..?

నల్లజాతీయుల మీద కొన్ని ఏళ్లుగా జరుగుతున్న వర్ణ వివక్షపై అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రగులుతూ ఉన్నాయి. 52 సంవత్సరాల నిరాయుధుడైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ను అకారణంగా పోలీసులు చంపేశారని తెలియడంతో అమెరికా రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ తనకు ఊపిరి ఆడడంలేదు.. ఊపిరి ఆడడం లేదు అంటున్నా కూడా పోలీసులు అతని కుత్తుకమీద కాలు పెట్టి హింసించిన వీడియో బయటకు రావడంతో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ఇదే అదనుగా భావించిన మరికొందరు లూఠీలను చేయడం మొదలుపెట్టారు. అమెరికా పోలీసులు క్షమాపణలు చెప్పాలని.. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి కారకులైన వారిని అరెస్ట్ చేయాలంటూ అమెరికాలో పెద్ద ఉద్యమమే మొదలైంది.



ఇటువంటి సమయంలో నిరసనకారులు ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ అధికారిక నివాసం వైట్ హౌస్ లోకి అడుగుపెట్టారని.. అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి అంటూ కొందరు ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. వైట్ హౌస్ తూర్పు గేట్ వద్ద కాల్పుల శబ్దం కూడా వినిపించిందంటూ వీడియోను పోస్ట్ చేశారు. అలాగే డోనాల్డ్ ట్రంప్ బంకర్ లోకి వెళ్లిపోయారని.. 40 అమెరికా నగరాలు కర్ఫ్యూ అంచున ఉన్నాయంటూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు.

“Firing reported near the east gate of White House. #DonaldTrump taken to an underground bunker for nearly an hour. As many as 40 American cities are under curfew over the death of #GeorgeFloyd in police custody!” అంటూ ఒక వీడియోను లింక్ చేసి వైరల్ చేయడం మొదలుపెట్టారు.

Fact check:

మరికొందరైతే ట్రంప్ తన కుటుంబంతో కలిసి కెన్సాన్ కు వెళ్లిపోయారంటూ ట్వీట్ చేస్తున్నారు. సిఐఏ ఎమర్జెన్సీ మీటింగ్ ను నిర్వహిస్తోందని చెప్పుకుంటూ వచ్చారు.

ఈ వీడియో ఫేస్ బుక్ లో కూడా పెద్ద ఎత్తున షేర్ చేశారు.

నిజ నిర్ధారణ:

002

వైట్ హౌస్ మీద నిరసనకారులు దాడి చేశారన్నది పచ్చి అబద్దం.

వీడియోను జాగ్రత్తగా కామనించగా.. మెరుస్తూ ఉన్న డిజిటల్ నేమ్ బోర్డ్స్ ను చూడొచ్చు.

వైట్ హౌస్ ఒరిజినల్ బిల్డింగ్ ఫోటోలు చూస్తే అలాంటివీవీ కనిపించవు.. వెనుకవైపు కేవలం పచ్చని చెట్లు మాత్రమే ఉంటాయి.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోలు ఓహియో స్టేట్ హౌస్ కు చెందినవి. అదే బిల్డింగ్ ను డిజిటల్ నేమ్ బోర్డ్స్ బ్యాగ్రౌండ్ లో ఉండడం చూడొచ్చు.

ఒహియో స్టేట్ హౌస్ ను గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా చూడొచ్చు.

అమెరికాకు చెందిన న్యూస్ పేపర్స్, వెబ్ సైట్స్, మీడియా సంస్థల కథనాల ప్రకారం నిరసనకారులు ఉన్న ప్రాంతం ఒహియో స్టేట్ హౌస్.

వాషింగ్టన్ లో ఉన్న అమెరికా ప్రెసిడెంట్ అధికారిక నివాసమైన వైట్ హౌస్ మీద నిరసనకారులు ఎటువంటి దాడులు చేయలేదు.

Claim Review:Fact check: నిజమెంత: నిరసనకారులు వైట్ హౌస్ మీద దాడిచేశారా..?
Claim Fact Check:false
Next Story