Fact Check : చైనా సైనికులు భారీ లౌడ్ స్పీకర్లు ఉపయోగించిన వీడియో వైరల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2020 12:12 PM GMT
Fact Check : చైనా సైనికులు భారీ లౌడ్ స్పీకర్లు ఉపయోగించిన వీడియో వైరల్..!

పెద్ద లౌడ్ స్పీకర్ ఉన్న వాహనాన్ని చైనా సైనికులు తీసుకుని వచ్చారని చెబుతూ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లడఖ్ లోని భారత సైనికుల కోసమే చైనా ఆర్మీ ఈ పెద్ద లౌడ్ స్పీకర్ ను తీసుకుని వచ్చిందని చెబుతూ ఉన్నారు.



“The Chinese army uses this super loudspeaker to play music at the Indian military camp in Ladakh! A large number of Indian soldiers’ eardrums were injured and vomiting,” అంటూ మెసేజీని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు. చైనా ఆర్మీ ఈ భారీ లౌడ్ స్పీకర్ ను తీసుకుని రావడానికి ముఖ్య కారణం.. దీని ద్వారా పెద్ద ఎత్తున పాటలను ప్లే చేసి భారత సైనికుల కర్ణభేరి పగిలిపోయేలా చేయడం అంటూ మెసేజీని ఉంచారు. చాలా మంది ఈ వీడియోను పోస్టు చేస్తున్నారు.

02

ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

ఈ వీడియో ఇప్పటిది కాదు. నాలుగు సంవత్సరాల కిందటిది..! ప్రస్తుతం భారత్-చైనా దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదు.

వీడియోకు సంబంధించిన కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా పలు రిజల్ట్స్ లభించాయి. ‘Elsa Chen’ అనే యూట్యూబ్ ఛానల్ లో మార్చి 20, 2016న “LION KING Defender Siren” అనే పేరుతో వీడియోను అప్లోడ్ చేశారు.

“The largest air-raid siren in the world. Produced by TaizhouLionKing Signal Co., Ltd.”అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రపంచం లోనే అతి పెద్ద సైరెన్ అని చెబుతున్నారు. డిఫెన్స్ లో భాగంగా ఎమర్జెన్సీ సైరన్లను ఇవ్వడం కోసం ఈ వాహనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకానీ ఇది లౌడ్ స్పీకర్ కాదు.

భారత్-చైనా దేశాల మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే..! చైనా ఆర్మీ లౌడ్ స్పీకర్స్ లో బాలీవుడ్ సాంగ్స్ ను పెట్టినట్లు కూడా కథనాలు వచ్చాయి. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం భారత్-చైనా మధ్య ఉన్న పరిస్థితులకు ఎటువంటి సంబంధం లేదు.

సెప్టెంబర్ 16, 2020న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఆర్టికల్ లో 'వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతం, ఫింగర్-4, మోల్డో గ్యారిసన్, ఛుసుల్ సెక్టార్ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లను అమర్చారు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు. పంజాబీ పాటలను వినిపిస్తున్నారు. నెగెటివ్ వైబ్రేషన్స్ కలిగించే పంజాబీ పాటలను ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. 1990 దశాబ్దం నాటి పాత పంజాబీ పాటలను చైనా సైనికులు వినిపిస్తున్నారని, రౌండ్ ద క్లాక్ తరహాలో వాటిని ప్లే చేశారని' ఉంది.

ఈ లౌడ్ స్పీకర్ల శబ్దాల వలన భారత సైనికులు గాయపడ్డారు అన్న వార్తలు ఎక్కడ కూడా రాలేదు.

కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story