బిగ్‌బ్రేకింగ్ : వెట‌ర్న‌రీ వైద్యురాలు హత్య కేసులో పురోగ‌తి

ముఖ్యాంశాలు

  • పోలీసుల అదుపులో నిందితులు
  • ఇద్ద‌రిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • 24 గంట‌ల్లోనే పురోగ‌తి

వెట‌ర్న‌రీ వైద్యురాలు హత్య కేసులో ఇద్ద‌రు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. నిందితులు మహాబూబ్ నగర్ జిల్లా నారాయణ్ పేట్ వాసులై ఉండిఉంటార‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు. నిందితులు ముందుగా వెట‌ర్న‌రీ వైద్యురాలుపై అత్యాచారం చేసి.. ఆపై కిరోసిన్ పోసి తగలబెట్టి ఉంటార‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

వెట‌ర్న‌రీ వైద్యురాలు ఘ‌ట‌న‌కు ముందుగా త‌న చెల్లితో ఫోన్‌లో మాట్లాడిన‌ట్టుగా.. లారీ డ్రైవర్, క్లినర్ లే ఈ ఘాతుకానికి పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. వెట‌ర్న‌రీ వైద్యురాలు స్కూటీ టైర్ పంచ‌ర్ అయిన నేఫ‌థ్యంలో.. సాయ‌ప‌డ‌తామ‌ని న‌మ్మ‌బ‌లికి నిందితులు ఈ ఘాతుకానికి తెగించిన‌ట్టు తెలుస్తుంది. హ‌త్య‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో నిందితుల‌ను మ‌ద్యాహ్నం 3గంట‌ల‌కు మీడియా ఎదుట హాజ‌రుప‌రుచ‌నున్న‌ట్టు స‌మాచారం.

నిన్న‌ షాద్‌నగర్‌ సమీపంలో వెటర్నరీ వెట‌ర్న‌రీ వైద్యురాలు హత్య కలకలం రేపింది. షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి వద్ద మంటలను చూసిన రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.