'వెంకీమామ' ఫ‌స్ట్ సాంగ్ ఎలా ఉంది..?

By Medi Samrat  Published on  8 Nov 2019 11:13 AM GMT
వెంకీమామ ఫ‌స్ట్ సాంగ్ ఎలా ఉంది..?

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్యల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ 'వెంకీమామ‌'. ఈ చిత్రానికి 'జైల‌వ‌కుశ' ఫేమ్ కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ పోస్టర్ మరియు ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పంద‌న ల‌భించింది.

తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ గా ‘వెంకీమామ’ అంటూ సాగే టైటిల్ ట్రాక్ ని యూట్యూబ్లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. తన మామయ్య గురించి మేనల్లుడు ఎంతో గొప్పగా చెప్తూ మాస్ స్టైల్ బీట్ తో సాగిన ఈ సాంగ్ కి థమన్ అందించిన మ్యూజిక్ పెద్ద అసెట్ అని చెప్ప‌చ్చు. ఇక ఈ సాంగ్ ను సింగర్ శ్రీకృష్ణ ఆలపించగా, ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.

ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇలా రిలీజ్ చేసారో లేదో అలా దూసుకెళుతుంది. ఇందులో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్, చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అటు ద‌గ్గుబాటి అభిమానులు, ఇటు అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను అతి త్వ‌ర‌లో అఫిషియల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారు.

Next Story
Share it