'వెంకీ మామ' రిలీజ్ డేట్ ఇదేనా..?
By న్యూస్‌మీటర్ తెలుగు
రిలీజ్ డేట్ విషయంలో సంక్రాంతికి రానున్న హీరోలను టెన్షన్ పెడుతూ వార్తల్లో నిలిచిన సినిమా వెంకీ మామ. దసరాకి వస్తుంది అన్నారు రాలేదు. ఆతర్వాత దీపావళికి వస్తున్నాడు వెంకీ మామ అన్నారు రాలేదు. ఆతర్వాత సంక్రాంతికి వస్తున్నాడు అనడంతో సంక్రాంతికి రానున్న హీరోలు బాగా టెన్షన్ పడ్డారు. అయితే... సంక్రాంతికి వస్తున్నాడో లేదో ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.
అయితే... తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే... సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఆల్రెడీ థియేటర్స్‌కి బుక్ చేసుకోవడంతో వెంకీమామకి ఎక్కువ థియేటర్స్ దొరకడం లేదట. అందుచేత సంక్రాంతికి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడం కంటే డిసెంబర్ 11న ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడం బెస్ట్ అనుకుంటున్నారట. ఇప్పుడు ఈ విషయం పై సురేష్ బాబు సీరియస్‌గా ఆలోచిస్తున్నారట. ఒకట్రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని తెలిసింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దీపావళి తర్వాత నుంచి ప్రమోషన్స్ లో స్పీడు పెంచే పనిలో ఉన్నారట. మరి.. వెంకీ, చైతు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.