వెంకీమామ రిలీజ్ డేట్ - వాట్ డేట్ గురు..

By Newsmeter.Network  Published on  3 Dec 2019 9:46 AM GMT
వెంకీమామ రిలీజ్ డేట్ - వాట్ డేట్ గురు..

విక్ట‌రీ వెంక‌టేష్ - యువ సమ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అటు అక్కినేని అభిమానులు, ఇటు ద‌గ్గుబాటి అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే... ఎట్ట‌కేల‌కు ఈ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

ద‌గ్గుబాటి రానా ఈ సినిమాని వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఇంకా ప‌ది రోజులు మాత్ర‌మే ఉంది. ప్ర‌మోష‌న్స్ చేయ‌డానికి.. ఇంత త‌క్కువ టైమ్ పెట్టుకుని సినిమాని రిలీజ్ చేస్తుండ‌డం పై కొంతమంది అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. క్రిస్మ‌స్ కానుక‌గా ఈ నెల 25న రిలీజ్ చేస్తార‌నుకున్నారు.

స‌డ‌న్ గా డిసెంబ‌ర్ 13న రిలీజ్ అని ప్ర‌క‌టించారు. వెంకీ, చైతు క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు ఎఫ్ 2 సినిమాతో వెంకీ, మ‌జిలీ సినిమాతో చైత‌న్య స‌క్స‌స్ లో ఉన్న టైమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుండ‌డం పై వెంకీమామ పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది కానీ.. ప్ర‌మోష‌న్స్ కి మాత్రం చాలా త‌క్కువ టైమ్ ఉంది. మ‌రి.. ఈ వెంకీమామ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

Next Story
Share it