ఆకట్టుకుంటున్న 'వి' సాంగ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2020 1:26 PM GMT
ఆకట్టుకుంటున్న వి సాంగ్‌

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'వి'. నాని కెరీర్‌లో 25వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో నివేథా థామస్‌, అదితి రావు హైదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.

వస్తున్నా వచ్చేసున్నా' అంటూ సాగే ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది. శ్రేయా ఘోషల్ ఆలపించగా అమిత్ త్రివేది స్వరపరిచారు. ఈ పాటకి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.కాగా.. ఇటీవల విడుదల అయిన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఈ వీడియో సాంగ్‌లో నివేద థామస్‌ కాల్ చేసినట్లు.. సుధీర్‌బాబు-నాని ఇద్దరూ రియాక్డ్‌ అయి బయలుదేరినట్లు చూపించి.. చివరికి నివేద కాల్ చేసింది సుధీర్‌ బాబుకే అన్నట్లు విజువల్స్‌ చూపించారు.

కరోనా వల్ల థియేటర్లు మూత పడిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల్లో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేకపోవడంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

Next Story