ఓ వైపు టీడీపీ శ్రేణులు ఇసుక ధర్నాలు చేస్తుంటే.. వల్లభనేని వంశీ మాత్రం..
By Medi Samrat Published on : 25 Oct 2019 12:01 PM IST

బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో టీడీపీ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ భేటీ అయ్యారు. ఒంగోలు వెళ్తున్న సుజనా చౌదరిని వంశీమోహన్ గుంటూరులో కలిశారు. అనంతరం ఇద్దరూ కలిసి ఒకే కారులో ఒంగోలు వెళ్లారు. ఓ వైపు ఈ రోజు టీడీపీ తలపెట్టిన ఇసుక కొరత ఆందోళనకు వంశీ దూరంగా ఉండటం.. బీజేపీ నేత సుజనా చౌదరీని కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతుంది.
సీఎం జగన్ ను కలిసిన వంశీ
ఇదిలావుంటే.. సీఎం జగన్‌ను వంశీ తాడేపల్లి నివాసంలో కలిశాడు. మంత్రులు పేర్నినాని, కొడాలి నానిలతో సీఎం నివాసానికి చేరుకున్న వంశీ.. అనంతరం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.
Next Story