మూడుముళ్లు అనేది నిండు నీరేళ్లులాంటిదంటుంటారు. పెళ్లైన తర్వాత పిల్లా, పాపలతో గడపకుండా కొన్ని కాపురాలు విచ్ఛి విచ్ఛిన్నం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగే గొడవల కారణంగా పుట్టిన పిల్లలు బలవుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులకు నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణం అందరికి కలచివేస్తోంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా ఐదుగురు పిల్లలను గంగానదిలో విసిరేసింది కసాయి తల్లి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాదోహి జిల్లాలోని జహంగీరాబాద్‌ గ్రామానికి చెందిన మంజు యాదవ్‌, మృదుల్‌ యాదవ్‌లిద్దరు భార్యాభర్తలు. కొన్ని రోజులుగా వీరిమధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీరికి ఐదుగురు పిల్లలు. వీరి గోడవల కారణంగా మంజు యాదవ్‌ పిల్లలను నదిలో విసిరేసి చంపేయాలని నిర్ణయం తీసుకుంది.

దీంతో పిల్లలను గంగానది ఒడ్డుకు తీసుకెళ్లి నదిలో విసిరేసింది. గమనించిన గజ ఈగాళ్లు సహాయక చర్యలు చేపట్టారు. పిల్లల్లో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గుల్లంతయ్యారు. మృతి చెందిన పిల్లలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు. గల్లంతైన పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ రాంబదన్‌సింగ్‌ తెలిపారు. పిల్లలను గంగానదిలో విసిరేసిన తర్వాత కూడా ఆమె అక్కడి నుంచి వెళ్లలేదని స్థానికులు తెలిపారు. సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సుభాష్

.

Next Story