చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కేసులు నమోదు కాగా.. 5లక్షల మంది ఈ మహమ్మారి భారీన పడి మృత్యువాత పడ్డారు. మన దేశంలో ఈ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు దేశంలో 5లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 16వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయి.

కొందరు గబ్భిలాలు నుంచి అని చెబుతుండగా.. మరి కొందరు పందుల నుంచి అని, ఇంకొందరు పాత వైరస్సే రూపాంతరం చెందనని అంటున్నారు. వీటిలో ఏది నిజమో ఇంతవరకు సైంటిస్టులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనాను కృష్ణుడే పంపాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్ దస్మానా ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణభగవానుడే లోకంపైకి ఈ వ్యాధిని పంపాడని.. దీనికి ప్రథమాక్షర సిద్ధాంతాన్ని కూడా చెప్పుకొచ్చాడు. కరోనా వైరస్‌, కృష్ణ అనే రెండు పదాలు కూడా.. ‘క’ అనే అక్షరంతోనే మొదలు అవుతాయయని.. కాబట్టి కృష్ణుడే మనుషులపైకి కరోనా వదిలాడని అని సూర్యకాంత్ దస్మానా ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్‌ కూడా ‘క’ అనే అక్షరంతోనే మొదలవుతుందని.. బహుశా కాంగ్రెస్‌ పార్టీనే కరోనాను మనుషులపై ప్రయోగించిందనే సెటైర్లు వినపడుతున్నాయి.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *