ట్రంప్ పై 'అభిశంసన'లో తర్వాతి మలుపేంటి

By Newsmeter.Network  Published on  17 Dec 2019 1:18 PM GMT
ట్రంప్ పై అభిశంసనలో తర్వాతి మలుపేంటి

ముఖ్యాంశాలు

  • అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై అభిశంసన తీర్మానం
  • సెనేట్ లో ఓటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్న కమిటీ
  • అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు జుడిషియరీ కమిటీ ఆమోదం
  • పూర్తి స్థాయిలో సెనేట్ లో దీనిపై చర్చ జరిపేందుకు ఏర్పాట్లు
  • తీర్మానం నెగ్గితే డోనాల్డ్ ట్రంప్ కు తప్పని పదవీచ్యుతి
  • తీర్మానం వీగిపోతే ట్రంప్ అధ్యక్షపదవిలో కొనసాగుతారు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై సెనేట్ లో ప్రవేశపెట్టబోతున్న అభిశంసన తీర్మానానికి సంబంధించిన చర్చ ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ అభిశంసన తీర్మానంలో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా రుజువైతే వెంటనే ఆయన పదవినుంచి వైదొలగాల్సి ఉంటుంది.

ట్రంప్ పై అభిశంసన తీర్మానానికి సంబంధించి సెనేట్ లో ఓటింగ్ ప్రక్రియకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. డెమొక్రాట్లు ఈ తీర్మానాన్ని నెగ్గించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. అన్నివైపులనుంచీ మద్దతును కూడగట్టుకుని ట్రంప్ ను ఎలాగైనా సరే కుర్చీలోంచి దింపేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

అమెరికన్ సెనేట్ జుడిషియరీ కమిటీ ట్రంప్ పై అభిశంసనకు సంబంధించి రెండు తీర్మానాలను సెనేట్ లో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. అధికార దుర్వినియోగం అందులో మొదటిది కాగా, కాంగ్రెస్ ను అడ్డుకోవడం రెండవది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన విశేషాధికారాలను ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులపై విచారణ జరపాలని ఒత్తిడి తీసుకొచ్చేందుకుగానూ ఉక్రెయిన్ కు మిలటరీ మద్దతును ఉపసంహరించడమేకాక, దేశ ప్రయోజనాలకోసమే అలా చేయాల్సివచ్చిందంటూ జాతిని మోసం చేశారన్నది మొదటి అభిశంసన తీర్మానం.

రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధించేందుకు ప్రత్యేకించి వైట్ హౌస్ లోని తన కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించడంద్వారా ట్రంప్ పూర్తిస్థాయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేది రెండవ అభిశంసన తీర్మానం. ఈ రెండు తీర్మానాలనూ డెమొక్రాట్లు చాలా పకడ్బందీగా సెనేట్ లో ప్రవేశపెట్టేందుకు సర్వశక్తుల్నీ కేంద్రీకరించారు.

అభిశంసన తీర్మానం నిర్వాహణ తీరు

ఈ కేసుకు సంబంధించి లీడ్ తీసుకున్న అభిశంసన నిర్వాహకులు సాధారణంగా జుడిషియరీ వ్యవస్థలో లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థలో సభ్యులై ఉంటారు. ఈ సభ్యుల సంఖ్య 13 కంటే తక్కువగా ఉండొచ్చు. 1998లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పై ఇదే విధంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు అప్పట్లో ఆ కమిటీలో 13మంది సభ్యులున్నారు. ఈసారి అంతకంటే తక్కువ సంఖ్యలోనే కమిటీ సభ్యులు ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆడమ్స్ శ్చిఫ్, జుడిషియరీ కమిటీ చైర్మన్ జెరాల్డ్ నాద్లెర్ ముందువరసలో ఉండి కమిటీకి దిశా నిర్దేశం చేస్తారు. వీరిద్దరి నేతృత్వంలో మొత్తంగా ఈ వ్యవహారమంతా ముందుకునడుస్తుంది. అన్నీ సవ్యంగా జరిగితే, తీర్మానం నెగ్గితే ట్రంప్ కు పదవీగండంనుంచి బయటపడే అవకాశం లేదు.

పార్లమెంట్ నేతలు సభలో ప్రవేశ పెట్టే అభిశంసన తీర్మానం ఓటింగ్ కు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టారు. త్వరలోనే పార్లమెంట్ కు సెలవలు రాబోతున్నాయి కనుక ఈ లోగానే ఓటింగ్ ప్రక్రియ ముగియాలని సభ్యులు భావిస్తున్నారు.

సెనేట్ లో 2020 ట్రయల్ ద్వారా ఆమోదాన్ని పొందేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.

బుధవారం నాడు ఈ రెండు తీర్మానాలపై సెనేట్ లో ఓటింగ్ జరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

సెనేట్ లో డిబేట్ కి సంబంధించిన విధి విధానాలను, నియమాలను ఏర్పరిచేందుకు మంగళవారంనాడు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

రెగ్యులర్ బిల్లు విషయంలో జరిగినట్టుగానే ఫ్లోర్ ఆమోదాన్ని పొందేందుకు అవసరమైన విధివిధానాలను అవలంబించబోతున్నారు.

అభిశంసన తీర్మానం మూడింట రెండువంతుల ఓట్లతో ఆమోదం పొందితే ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా భావించి ఆయనను అధ్యక్ష పదవినుంచి తొలగిస్తారు.

ఒకవేళ రెండు తీర్మానాలూ వీగిపోతే డోనాల్డ్ ట్రంప్ గండంనుంచి పూర్తిగా బయటపడినట్టే.

దీనికి సంబంధించిన నాలుగు సాక్ష్యాలను ప్రవేశపెట్టాలన్నది సెనేట్ మైనారిటీ నేత ఛక్ స్కమ్మర్ ప్రతిపాదన.

ప్రస్తుతం సర్వోన్నత అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మిక్ మల్వెనే, పూర్వ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్డన్ ఈ నలుగురు సాక్షుల్లో ప్రధాన సాక్షులు.

జనవరి 6వ తేదీన విచారణ మొదలవబోతోంది. మొదలైన క్షణంనుంచీ 126 గంటలపాటు ప్రకటనలు, పరీక్షలు, ప్రశ్నావళి, ఉద్దేశాల స్వీకరణ మొత్తంగా అన్నీ కలిపి దరిదాపుగా మూడు లేదా అంతకంటే ఎక్కువ వారాలపాటు అభిశంసన తీర్మానంపై విచారణ కొనసాగనుంది.

అమెరికా చరిత్రలో కాంగ్రెస్ దేశాధ్యక్షుడిని పదవినుంచి తొలగించేందుకు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి.

సెనేట్ లో ఆరోపణలు గనక రుజువైతే వెంటనే డోనాల్డ్ ట్రంప్ ను దేశాధ్యక్ష పదవినుంచి దింపేస్తారు.

Next Story