న్యూయార్క్ టైమ్స్‌ స్క్వేర్‌‌లో రాముడి భారీ డిస్‌ప్లే పై వివాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2020 10:58 AM GMT
న్యూయార్క్ టైమ్స్‌ స్క్వేర్‌‌లో రాముడి భారీ డిస్‌ప్లే పై వివాదం

ఆగస్టు 5న అయోధ్య రామమందిరం ఆలయం శంకుస్థాపన జరగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌‌లో బిల్‌బోర్డ్స్‌ మీద రామాలయం, రాముడి ఫొటోలు, రామనామం, శంకుస్థాపన జరుగుతున్న వీడియోలను 3డీ పోర్ట్‌రైట్స్‌లో డిస్‌ప్లే చేస్తున్నారు. అమెరికన్‌ ఇండియా పబ్లిక్‌ అఫైర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఈ డిస్‌ప్లే ఉండనుంది. భారత‌ కమ్యూనిటీకి చెందిన వారు అక్కడకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

బిల్ బోర్డ్ డిస్ప్లేను కొందరు తిరస్కరిస్తూ ఉన్నారు. 20 ఆర్గనైజేషన్లు, చాలా మంది వ్యక్తులు కలిసి న్యూ యార్క్ మేయర్ బిల్ డి బ్లాసియోకు లెటర్ ను రాశారు. అభ్యంతరం చేసిన వారిలో ముస్లిం సంస్థలు కూడా ఉన్నాయి. భారత్ లో ముస్లింల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకం అని వారు లెటర్ లో రాశారు. ఒక మతానికి అనుకూలంగా అక్కడ ప్రకటనలను ప్రదర్శించడం సరికాదంటూ న్యూయార్క్‌ గవర్నర్‌, మేయర్‌, నగర పాలక మండలి, చట్టసభ్యులతోపాటు ఆ యాడ్‌ కంపెనీపై ఒత్తిడి తెస్తున్నాయి.

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను ప్రస్తావనను కూడా ఈ లెటర్లలో తెచ్చారు. అమెరికన్ ఇండియన్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ తీసుకొచ్చిన ఈ ప్రకటన వల్ల ఇస్లామోఫోబియా పెంపొందించే అవకాశం ఉందని అన్నారు. 425 సంవత్సరాల పురాతనమైన మసీదును కూల్చారని.. 3000 మంది చనిపోడానికి కారణమైందంటూ ప్రస్తావించారు.

Next Story