ముంబై: ఊర్మిళ అంటే తెలియని వారుండరు. వర్మ హీరోయిన్ ఓ దశాబ్దంపాటు యువకుల మనసులను కోలుకోకుండా చేసింది. సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన తరువాత కొంతకాలం ముంబైలో ఖాళీగా ఉంది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు ఊర్మిళ. అయితే.. ఎన్నికల్లో ఈ అందాల భామకు ఓటమి తప్పలేదు. ఓటమితో రాజకీయాలకు దూరంగా ఉన్న ఊర్మిళ ..షడన్‌గా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ముంబై కాంగ్రెస్‌లోని ఇంటర్నల్ పాలిటిక్స్‌ ఆమెను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు బై చెప్పిన ఊర్మిళ బీజేపీలో చేరుతారని అందరూ ఊహించారు. కాని..శివసేనలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కూడా ఈ బ్యూటీ ఖండించింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.