ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు మృతి

By సుభాష్  Published on  20 May 2020 3:44 AM GMT
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఏటావా నుంచి కొంత మంది రైతులు జాక్‌ఫూట్‌ పండ్లను ట్రక్కులో మార్కెట్‌కు తీసుళ్తుండగా, ప్రయాణిస్తున్న ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతి చెందారు. మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డ రైతును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం జరగడంతో కొంతసేపు ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తర్వాత పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో రోడ్డు ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇటీవల కేంద్రం లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో మళ్లీ రహదారులు రక్తమోడుతున్నాయి. ఈ ప్రమాదాల్లో అధికంగా వలస కూలీలే మృత్యువాత పడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు స్వస్థలాలకు బయలుదేరుతూ రోడ్డు ప్రమాదాల వల్ల వారి ప్రాణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి.

అంతేకాదు రైతులు కూడా మృతి చెందుతున్నారు. రెక్కడితే కాని డొక్కాడని వలస కూలీలకు రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఎన్నో ప్రమాదాలు జరిగి.. ఎంతో మంది అమయాకు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

Next Story
Share it