గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

By సుభాష్  Published on  21 Aug 2020 9:50 AM GMT
గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి

ఉత్తరప్రదేశ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జన్‌ మేజయసింగ్‌ (75) గుండెపోటుతో మృతి చెందారు. గురువారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి డాక్టర్‌ రామ్‌ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ క్రమంలో ఫేస్‌ మేకర్‌ అమరుస్తుండగా, స్టోక్‌తో మరణించినట్లు డాక్టర్‌ విక్రమ్‌సింగ్‌ తెలిపారు.

కాగా, ఎమ్మెల్యే జన్‌ మేజయసింగ్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్దికి, పేద ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని ఆయన లేని లోటు తీరనిదన్నారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల అభివృద్దికి ఎంతో కృషి చేశారని సీఎం ప్రశంసించారు. ఎంతో అంకిత భావంతో పని చేశారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. ప్రజలు ఓ మంచి నాయకున్ని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, డియోరియా అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందిన జన్‌ మేజయసింగ్‌.. 2012 ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ప్రమోద్‌సింగ్‌పై 23వేలకుపైగా ఓట్లతో గెలుపొందారు. 2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి జైశాల్వ్‌పై 46వేలకుపైగా ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎమ్మెల్యేకు భార్య, ఏడుగురు పిల్లలున్నారు. వీరిలో ముగ్గురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు.



Next Story