హైదరాబాదీ స్టూడెంట్ కి అయిదు అమెరికన్ వర్సిటీల నుంచి ఆహ్వానం

By సుభాష్  Published on  7 March 2020 2:30 PM IST
హైదరాబాదీ స్టూడెంట్ కి అయిదు అమెరికన్ వర్సిటీల నుంచి ఆహ్వానం

రోండా బైర్నె తన పుస్తకం “ది సీక్రెట్” లో లా ఆఫ్ ఎట్రాక్షన్ గురించి వ్రాస్తారు. ఏదో ఒక లక్ష్యం పట్ల ఆకర్షణ ఉంటే, మనలో ఫోకస్, తపన పెరుగుతాయని, తద్వారా లక్ష్యం సాధిస్తామని రోండా అంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిని శిల్పీ మండల్ ను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఆమె అన్నిటి కన్నా కష్టమైన మాథమాటిక్స్ ను ఎంచుకుని. అందులో పీ హెచ్ డీ చేయాలని పూనుకుంది. అందుకోసం చాలా కష్టపడింది. ఆశ్చర్యం ఏమిటంటే ప్రపంచంలోని అత్యంత సుప్రసిద్ధమైన అయిదు యూనివర్సటీల నుంచి ఆమెకు ఆహ్వానం వచ్చింది. ధియరిటికల్ మాథమాటిక్స్ లో రిసెర్చి చేయాలన్నదే ఆమె అభిలాష.

తనకు అసలు ఏదైనా యూనివర్సిటీ నుంచి పిలుపు వస్తుందా అని సందేహపడిన శిల్పి కి ఇప్పుడు ఒకటి కాదు రెండుకాదు ఏకంగా అయిదు ఆఫర్లు ఉన్నాయి. శిల్పి ఇప్పటికే తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ మాథమాటిక్స్, చెన్నై, హరిశ్చంద్ర ఇన్ స్టిట్యూట్, అలహాబాద్ లలో ఇంటర్న్ షిప్ లు చేసింది. ఆమె ఇంతకు ముందే సింపా స్కూల్ ఇన్ అరిథమెటిక్ అండ్ జామెట్రీ , గడ్జా మాదా యూనివర్సిటీ ఇండోనీషియలలో ఆమె చదువుకున్నారు. ఆమెకు ఆల్జీబ్రా, నంబర్ థియరీలంటే ఎంతో ఇష్టం. ఈ ఫీల్డులోనే పరిశోధనలు చేయాలని ఆమె భావిస్తున్నారు.

ఆమెకిప్పుడు ఎమోరీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా, యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్, యూనివర్సిటీ ఆఫ్ ఓక్టహోమా, లౌసియానా స్టేట్ యూనివర్సిటీలనుంచి పీ హెచ్ డీ చేసేందుకు ఆహ్వానాలు వచ్చాయి. ఎమోరీ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలో ఆమె అత్యధిక మార్కులు సాధించింది.

Next Story