విజయవాడలో నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆకాశవాణి టవర్ ఎక్కి నిరసన తెలిపారు. జగనన్న.. జాబ్ ఇవ్వన్న అంటూ నినాదాలు చేశారు.
సీఎం జగన్ వెంటనే స్పందించి మాతో మాట్లాడాలని.. పెట్రోల్ బాటిళ్లతో సచివాలయం ఎదుట నిరుద్యోగ మహిళలు బైఠాయించారు.
బీఎస్సీ, ఎమ్మెస్సీ బాటనీ అభ్యర్థులకు విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ జాబ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యువతను ప్రోత్సాహిస్తాము అని చెప్పిన సీఎం జగన్ మాకు అన్యాయం జరగకుండా అన్ని విధాల న్యాయం చేసి, ఉద్యోగభృతిని కల్పించాలని కోరారు.