స‌చిన్ ఔట్ అవ‌కున్నా ఔటిచ్చా.. ఒక్క‌సారి కాదు..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Jun 2020 9:19 AM IST
స‌చిన్ ఔట్ అవ‌కున్నా ఔటిచ్చా.. ఒక్క‌సారి కాదు..

స్టీవ్‌బక్నర్.. క్రికెట్ గురించి తెలిసిన వాళ్ల‌కు ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఫీల్డ్‌లో చాలా ప‌ర్యాయాలు త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచిన అంపైర్‌. తాజాగా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్‌ విష‌యంలో రెండుసార్లు త‌ప్పుడు నిర్ణ‌యం ప్ర‌క‌టించాన‌ని వెల్ల‌డించాడు. ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. 2003లో ఆస్ట్రేలియా వేదికగా జరిగిన గబ్బా టెస్టు, ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా 2005లో పాకిస్థాన్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో రెండోసారి అదే తప్పుడు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించాన‌ని వెల్ల‌డించాడు.

సచిన్‌‌ రెండుసార్లు ఔట్‌ కాకున్నా పొరపాటున ఔటిచ్చానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు‌ స్టీవ్‌బక్నర్‌.. ఏ అంపైర్‌ కూడా కావాలని అలా చేయడని.. అలా తప్పుడు నిర్ణయాలు ప్ర‌క‌టిస్తే.. అది ఆట‌గాడి భవిష్యత్‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని.. అయితే, తప్పులు చేయడం మానవ సహజమ‌ని బక్నర్ అన్నారు.

2003లో ఆస్ట్రేలియా వేదికగా జ‌రిగిన‌ గబ్బా టెస్టులో స‌చిన్‌ను ఎల్బీగా ఔటిచ్చానని.. పేస‌ర్‌ జేసన్‌ గిలెస్పీ వేసిన ఆ బంతి వికెట్ల పైనుంచి వెళ్లిందని అన్నారు. ఆ త‌ర్వాత‌ భారత్‌లో 2005లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అబ్దుల్‌ రజాక్‌ వేసిన ఓ బంతి సచిన్‌ బ్యాట్‌ దాటివెళ్లాక మలుపు తిరిగింది. కానీ ఆ బంతి బ్యాట్‌కు తగల్లేదు. అప్పుడు నాటౌట్‌ను అవుటిచ్చాన‌ని.. ఈడెన్‌గార్డెన్స్‌లో మ్యాచ్‌ అంటే ప్రేక్షకుల సందడి బాగా వుంటుంద‌ని.. మైదానంలో ఏం జరిగినా వినపడదని.. అలా రెండుసార్లు తప్పులు జ‌రిగిపోయాన‌ని బక్నర్ అన్నారు.

అయితే త‌ప్పుడు నిర్ణ‌యాల‌పై తాను బాధపడ్డాన‌ని. మానవులు తప్పులు చేయడం సహజమేన‌ని.. వాటిని అంగీకరించడం జీవితంలో ఓ భాగమ‌ని బక్నర్‌ తన చేదు అనుభవాలను పంచుకున్నాడు. 74 ఏళ్ల స్టీవ్ బ‌క్న‌ర్ త‌న కెరీర్‌లో 181 వ‌న్డేలు, 128 టెస్టుల‌లో అంఫైర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు.

Next Story