కుప్పకూలిన విమానం.. 25 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 26 Sept 2020 11:00 AM ISTఉక్రెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి మిలటరీ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ వైమానిక దళానికి చెందిన సైనిక విమానం ఏఎన్-26 తూర్పు ప్రాంతంలోని ఖర్కీన్ సమీపంలో కూలిపోయింది. ఈ ఘటనలో 25 మంది దుర్మరణం చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాని ఆ దేశ ప్రాజిక్యూటర్ జనరల్ ప్రకటనలో తెలిపారు. మిలటరీ విమానం ఇంజిన్ విఫలమై కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరికొందరి ఆచూకీ కోసం ఘటనాలో స్థలంలో గాలింపు కొనసాగుతున్నది. విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నది స్పష్టంగా తెలియరాలేదు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమియర్ జెలెన్‌స్కీ ప్రమాదంపై ద్వారా స్పందించారు. ఈ ఘటనపై విచారణకు తక్షణమే కమిషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విమానం కూలిపోవడానికి గల కారణాలు కమిటీ దర్యాప్తులో వెల్లడవుతాయని అన్నారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో అధ్యక్షుడు శనివారం పర్యటించనున్నారు.