బ్రిటన్ లో కరోనా వస్తే 80% జీతం

కరోనా వైరస్‌ కారణంగా మూత పడిన కంపెనీలు, ఫ్యాక్టరీల ఉద్యోగులకు 80శాతం వరకు వేతనాలు చెల్లించాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని ఏ యజమాని అయినా ఈ చెల్లింపుల కోసం హెచ్ఎంఆర్‌సికి దరఖాస్తు చేసుకోవచ్చని, ఒక కార్మికుడికి నెలకు 2500 పౌండ్ల వరకు ( బ్రిటన్‌ సగటు ఆదాయం కన్నా కాస్త ఎక్కువ) చెల్లింపునకు అవకాశం వుంటుందని బ్రిటన్‌ ఆర్థిక ఛాన్సలర్‌ రిషి సునాక్‌ తెలిపారు. బ్రిటన్‌ ప్రభుత్వ చరిత్రలో మొదటిసారిగా ఈ చర్య తీసుకుంటున్నట్లు చెప్పారు. కంపెనీ పే రోల్‌ జాబితాలో కార్మికుల పేర్లు తొలగించకుండా వుంచినట్లైతే లక్షలాదిమంది కార్మికుల వేతనాల్లో కొంత మొత్తానికైనా ప్రభుత్వం హామీగా వుంటుందనే ఈ చర్యకు అర్థమని ఆయన పేర్కొన్నారు. తొలుత మూడు మాసాల పాటు ఈ పథకం అమల్లో వుంటుందవి. అవసరమైతే తర్వాత పొడిగిస్తామని చెప్పారు.

Also Read: తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ సంచలన నిర్ణయం

కరోనా నేపథ్యంలో వ్యాపార వాణిజ్య సంస్థలకు, ఉద్యోగులకు మద్దతుగా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగమే ఇదని అన్నారు. సాధ్యమైనంతవరకు ప్రజల ఉద్యోగాలు, ఆదాయాలను రక్షించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.

Also Read: నీటి వాడకంలో అగ్రస్థానం.. భారత్‌లో నీటి కష్టాలు..

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *