బ్రిటన్ లో కరోనా వస్తే 80% జీతం
By అంజి
కరోనా వైరస్ కారణంగా మూత పడిన కంపెనీలు, ఫ్యాక్టరీల ఉద్యోగులకు 80శాతం వరకు వేతనాలు చెల్లించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని ఏ యజమాని అయినా ఈ చెల్లింపుల కోసం హెచ్ఎంఆర్‌సికి దరఖాస్తు చేసుకోవచ్చని, ఒక కార్మికుడికి నెలకు 2500 పౌండ్ల వరకు ( బ్రిటన్ సగటు ఆదాయం కన్నా కాస్త ఎక్కువ) చెల్లింపునకు అవకాశం వుంటుందని బ్రిటన్ ఆర్థిక ఛాన్సలర్ రిషి సునాక్ తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వ చరిత్రలో మొదటిసారిగా ఈ చర్య తీసుకుంటున్నట్లు చెప్పారు. కంపెనీ పే రోల్ జాబితాలో కార్మికుల పేర్లు తొలగించకుండా వుంచినట్లైతే లక్షలాదిమంది కార్మికుల వేతనాల్లో కొంత మొత్తానికైనా ప్రభుత్వం హామీగా వుంటుందనే ఈ చర్యకు అర్థమని ఆయన పేర్కొన్నారు. తొలుత మూడు మాసాల పాటు ఈ పథకం అమల్లో వుంటుందవి. అవసరమైతే తర్వాత పొడిగిస్తామని చెప్పారు.
Also Read: తెలంగాణ లాక్ డౌన్.. కేసీఆర్ సంచలన నిర్ణయం
కరోనా నేపథ్యంలో వ్యాపార వాణిజ్య సంస్థలకు, ఉద్యోగులకు మద్దతుగా ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగమే ఇదని అన్నారు. సాధ్యమైనంతవరకు ప్రజల ఉద్యోగాలు, ఆదాయాలను రక్షించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
Also Read: నీటి వాడకంలో అగ్రస్థానం.. భారత్‌లో నీటి కష్టాలు..