పాతబస్తీలో రెండు తలల పాము లభ్యం
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 2 Oct 2019 3:35 PM IST

ఎటు కావాలంటే అటు అవలీలగా పాకుతూ వెళ్లే రెండు తలల పాము హైదరాబాద్ లోని పాతబస్తీ డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యక్షమయ్యింది. ఫరత్ నగర్ లో ఈ రెండు తలల పాము కనపించింది. ఓ ఇంటి బయట రెండు తలల పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న హోమ్ గార్డ్ అబిద్ అలీ రెండు తలల పామును రక్షించి ఎన్జీవో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారికి అప్పగించారు. ఇలాంటి అరుదైన పాములు కనిపించినప్పుడు జంతు సంరక్షణ శాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
Next Story