నిన్న ఒకరితో పెళ్లి.. నేడు మరొకరితో పెళ్లి.. 24 గంటల్లో రెండు పెళ్లిళ్లు

By సుభాష్  Published on  14 Jun 2020 1:58 PM GMT
నిన్న ఒకరితో పెళ్లి.. నేడు మరొకరితో పెళ్లి.. 24 గంటల్లో రెండు పెళ్లిళ్లు

ఓ యువతి గడిచిన 24 గంటల్లోనే రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి వారు కూడా ఉంటారా.. అన్న విధంగా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కనగల్‌ మండలం కురంపల్లికి చెందిన మౌనిక అనే యువతికి హైదరాబాద్‌కు చెందిన యువడితో వివాహం జరిగింది. బంధువుల సమక్షంలో తన కుమార్తె పెళ్లి జరగడం ఆ తల్లి ఎంతో సంబురపడింది.

వోడి బియ్యం పోసి అప్పగింతల సమయంలో మౌనిక ప్రియుడు రాజు రంగంలోకి దిగాడు. గతంలో మౌనిక సమీప బంధువు అయిన దేవరకొండ మండలం గోనబోయినపల్లికి చెందిన రాజుతో ప్రేమ ప్రయాణం సాగించింది. మౌనిక తల్లి మాత్రం హైదరాబాద్‌కు చెందిన యువకుడితో పెళ్లి జరిపించింది. అప్పగింతల సమయంలో అక్కడికి వచ్చిన మౌనిక ప్రియుడు రాజును చూసి బోరున విలపిస్తూ నువ్వే కాలంటూ పెళ్లి కుమార్తె పట్టుబట్టింది. ఈ సీన్‌ను చూసిన వరుడి బంధువులు షాక్‌కు గురై పోలీసులను ఆశ్రయించారు. ఇరు వర్గాల పెద్దలకు కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు.. తెగదెంపులు చేశారు.

నవ వరుడితో తెగదెంపులు చేసిన 24 గంటల్లోనే పెద్దల సమక్షంలో ప్రేమించిన యువకుడితో మళ్లీ పెళ్లి జరిపించారు. ఈ ఘటనను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇదేంటి ముందు ఒకరితో పెళ్లి జరిపించన తర్వాత ప్రేమించిన యువకుడు వస్తే తెగదెంపులు చేసి మళ్లీ పెళ్లి చేయడం ఏంటని ఆశ్చర్యపోయారు.

Next Story