దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 27వేలకు చేరుకుంది. ఇక మహారాష్ట్రలో కూడా కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 26వేలు దాటేసింది. ఇక కరోనా బారిన ఇద్దరు పోలీసులు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా ఇద్దరు పోలీసులు మృతి చెందడంపై పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. వారి మృతి పట్ల ముఖ్యమంత్రి ఉద్ధావ్‌ ఠాక్రే సంతాపం వ్యక్తం చేశారు.

మృతి చెందిన పోలీసులు ముంబైలోని వాహోలా పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మృతులు హెడ్‌కానిస్టేబుల్‌ సందీప్‌ ఎంసర్వీ, హెచ్‌సీ చంద్రకాంత్‌జీ పెండూల్కర్‌లని అధికారులు తెలిపారు. వీరి మృతి పట్ల ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బిర్‌ సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా పరామర్శించారు. ఒక్క పోలీసు శాఖలోనే సుమారు 40 మందికిపైగా కరోనా బారిన పడినట్లు తెలిపారు. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.