తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు.. అది కూడా
By అంజి Published on 24 March 2020 7:40 PM GMTహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 39కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పెషల్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. 24వ తేదీ రాత్రి 11 గంటలకు మరో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 57 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు ప్రకటించారు. అయితే బాధితుడు భద్రాద్రి కొత్తగూడెం చెందిన కరోనా సోకిన యువకుడి కుటుంబ సభ్యుడిగా గుర్తించారు. అదే కుటుంబంతో సన్నిహితంగా ఉన్న మరో వృద్ధురాలికి సైతం కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో ప్రైమరీ కాంటాక్ట్ కేసులు ఐదుకు చేరుకున్నాయి.
అంతకుముందు నగరంలోని మణికొండలో ఓ 64 ఏళ్ల వృద్ధురాలికి కరోనా వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన విషయం తెలిసిందే. బాధితురాలిని స్వీడన్ నుంచి కరోనా పాజిటివ్ యువకుడి కుటుంబ సభ్యురాలిగా అధికారులు గుర్తించారు.
ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 536కు చేరింది. మొత్తం 21,804 మంది నుంచి నమునాలు సేకరించామని ఐసీఎంఆర్ తెలిపింది.
మంగళవారం నాడు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న కేసుల్లో ఎవరీకి కూడా సీరియస్‌గా లేదన్న ఆయన.. అందరూ కోలుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ బాధితులకు ఏప్రిల్ 7 వరకు తగ్గిపోతుందన్నారు. ఈలోపు కొత్త కరోనా కేసు రాకపోతే.. వైరస్‌ను తరిమికొట్టినవారం అవుతామన్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నామని కేసీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 195 దేశాలకు కరోనా వైరస్ వ్యాపించిందన్నారు.
కరోనా పాజిటివ్ కేసుల పాస్‌పోర్టులు సీజ్ చేయాలని ఆదేశించామన్నారు. కరోనా వైరస్ పెద్ద మహమ్మారి.. మనందరం అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ అన్నారు. అమెరికాలో ఆర్మీని దింపారు. మాట వినకుంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇస్తామన్నారు. ఆర్మీని దింపాల్సి వస్తదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యనించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పారు.