పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఘాట్‌లో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు.

రావల్పిండి నుంచి స్కర్టుకు ఓ బస్సు 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. పర్వత ప్రాంతం నుంచి వెలుతుండగా.. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని గిల్గిత్‌ బాల్టిస్థిన్‌ ప్రభుత్వ ప్రతినిధి ఫైజుల్లా తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన మృతదేహాలను వెలికితీసేందుకు పాకిస్తాన్ ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి.

తోట‌ వంశీ కుమార్‌

Next Story