అప్పుల బాధతో సీరియల్ నటి ఆత్మహత్య
By తోట వంశీ కుమార్ Published on 23 July 2020 11:15 AM ISTసీరియల్ నటి మద్దెల సబీరా, అలియాస్ రేఖ(42) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన రేఖ నటనపై ఆసక్తితో హైదరాబాద్‌కు వెళ్లారు. రెండు టీవీ సీరియల్స్‌లో నటించారు. అయితే.. ఆ తరువాత అవకాశాలు రాకపోవడంతో గుంటూరు వచ్చి అహ్మద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ కుమారై ఉంది. కాగా.. మనస్పర్థల కారణంగా వారిద్దరు విడిపోయారు.
అనంతరం చైతన్య అనే వ్యక్తిని రేఖ వివాహం చేసుకుంది. చైతన్య రియల్ ఎస్టేల్ వ్యాపారం చేస్తుంటాడు. ప్రస్తుతం విద్యానగర్‌లో ఉంటున్న రేఖ కొన్నాళ్లపాటు వేడుకల్లో పాటలు పాడడం, యాంకరింగ్ చేయడం వంటివి చేశారు. గత రెండు సంవత్సరాలుగా పాటలు పాడడం మానేసింది. భర్త చైతన్య రియల్ ఎస్టేల్ వ్యాపారంలో నష్టాల పాలయ్యాడు. అవకాశాలు లేకపోవడంతో.. ఆర్థికంగా కుంగిపోవడంతో రేఖ తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో నిన్న స్నానం చేసేందుకు బాత్రూములోకి వెళ్లింది. భార్య ఎంతకీ భయటికి రాకపోవడంతో చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడకి చేరుకుని బాత్రూమ్ తలుపు పగలగొట్టి చూడగా.. రేఖ బాత్రూమ్‌లో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
జరుపుతున్నారు.