మ‌రో విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో ‌న‌టి మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 12:32 PM GMT
మ‌రో విషాదం.. రోడ్డు ప్ర‌మాదంలో ‌న‌టి మృతి

టీవీ పరిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. టీవీ నటి ప్రేక్షా మెహతా ఆత్మహత్య మరువక ముందే కన్నడ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో న‌టి మెబీనా మైఖేల్(22) మ‌ర‌ణించింది. త‌న స్వ‌స్థ‌లం మెడికెరికి వెళ్తుండ‌గా.. దేవీహ‌ళ్లి ద‌గ్గ‌ర ఓ ట్రాక్ట‌ర్ ఆమె కారుపైకి దూసుకువ‌చ్చింది. ఈ ప్ర‌మాదంలో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డింది. ఆమెను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించేలోపే మ‌ర‌ణించిన‌ట్లు స్థానికులు తెలిపారు..

మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన మెబీనా... ప్యాటే హుదుగిర్‌ హళ్లీ లైఫ్‌ 4 రియాలిటీ షో టైటిల్‌ కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన మెబీనా.. నిబంధనల సడలింపుల నేపథ్యంలో సొంతూరికి వెళ్లేందుకు పయనమై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

మెబీనా మరణవార్తతో ఆమె స్నేహితులు, టీవీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో పీహెచ్‌హెచ్‌ఎల్‌ 4 హోస్ట్‌ అకుల్‌ బాలాజీ ట్విటర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ‘‘నా ఫేవరెట్‌ కంటెస్టెంట్‌ ఆకస్మిక మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. మెబీనా చిన్న పిల్ల. తను చూడాల్సిన జీవితం ఎంతో ఉంది. కానీ ఇంతలోనే ఇలా. ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ ’అంటూ మెబీనాకు ట్రోఫీ అందిస్తున్న ఫొటోను షేర్‌ చేశారు.

Next Story