పోలీసుల అదుపులో సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు.. మోసం చేశాడని న‌టి ఫిర్యాదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 10:30 AM GMT
పోలీసుల అదుపులో సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె.నాయుడు.. మోసం చేశాడని న‌టి ఫిర్యాదు

సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడును ఎస్ఆర్‌న‌గ‌ర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఛోటా కే నాయుడు తమ్ముడు ఈయన. తెలుగులో చాలా సినిమాలకు శ్యామ్ ప‌నిచేశాడు. సినీ ఆర్టిస్టు సుధ ఫిర్యాదుతో ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి శ్యామ్ కె నాయుడు త‌న‌ను మోసం చేశార‌ని సినీ ఆర్టిస్టు సాయి సుధ ఎస్ఆర్‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. శ్యామ్ కె నాయుడుతో గ‌త ఐదేళ్లుగా ప‌రిచ‌యం ఉంద‌ని, 2015 నుంచి లివ్ ఇన్ రిలేష‌న్ షిప్‌లో ఉన్నామ‌ని తెలిపారు. మొద‌ట్లో త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని మాటిచ్చాడ‌ని ఈ విష‌యం అత‌ని ఇంట్లో సైతం తెలుసున‌ని సుధ పేర్కొంది. అత‌డితో చేసిన చాటింగ్‌లు, వాయిస్ కాల్ రికార్డ్స్ త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌న్నారు. చోటా కే నాయుడుకి సైతం ఈ విష‌యం తెలుస‌ని.. త‌ను కూడా మా పెళ్లి జ‌రిపిస్తాన‌ని మాటిచ్చాడ‌ని అన్నారు. పెళ్లి మాట ఎత్తితే ఇంట్లో ఉన్న గొడ‌వ‌ల కార‌ణంగా కొన్ని రోజులు ఆగ‌మ‌న్నార‌ని ఇప్పుడు అడిగితే.. ఎం చేసుకుంటావో చేసుకో అంటున్నార‌న్నారని అందుక‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు చెప్పారు.

Next Story
Share it