క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తిని నిరోధించ‌డానికి కేంద్రం లాక్‌డౌన్ ను విధించింది. దీంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. లాక్‌డౌన్ కార‌ణంగా దిన‌స‌రి కూలీలతో పాటు చాలా మంది పేద‌లు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న సెల‌బ్రెటీల‌తో పాటు సామాన్యులు త‌మ వంతు బాధ్య‌త‌గా క‌దిలి వ‌చ్చి వారికి సాయం చేయ‌డానికి విరాళాలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పేద‌ల‌ను ఆదుకునేందుకు మ‌ద్రాస్ హైకోర్టు పిలుపునిచ్చింది.

ఈ పిలుపుకు స్పందించిన ‌మ‌ద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్ద‌రు లాయ‌ర్లు బార్ కౌన్సిల్ ఆఫ్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరీల‌కు లాక్‌డౌన్ రిలీఫ్ ‌లకు చెరొక రూపాయి ఇచ్చార‌ట‌. మ‌రో ఇద్ద‌రు లాయ‌ర్లు ప‌ది రూపాయ‌ల‌ను విరాళంగా ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు బార్ కౌన్సిల్ రూ.60ల‌క్ష‌ల‌ను సేక‌రించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్, సీనియర్ అడ్వకేట్ ఎస్ ప్రభాకరన్ ఆ నలుగురు లాయర్ల పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ నిధుల‌ను లాక్‌డౌన్ కార‌ణంగా అవ‌స్త‌లు ప‌డుతున్న వారికి సాయంగా ఉప‌యోగించ‌నున్నారు. జస్టిస్ ఎస్ఎమ్ సుబ్రహ్మణ్యం రూ.2.5లక్షలు విరాళం ఇవ్వ‌గా.. చాలా మంది లాయర్లు ఒక్కొక్కరు రూ.5లక్షలు చొప్పున ఇచ్చారు. లాక్‌డౌన్ రిలీఫ్ ఫండ్ కోసం వారు కదిలివచ్చిన తీరుకు అప్రిసియేషన్ సర్టిఫికేట్ అంద‌జేయ‌నున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.