టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహోత్సవాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2020 9:14 AM GMT
టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులు లేకుండానే శ్రీవారి బ్రహోత్సవాలు

తిరుపల అన్నమయ్య భవన్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి 28 వరకు శ్రీవారి బ్రహోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వై.వి. సుబ్సారెడ్డి తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి అధిక స్థాయిలో ఉందని.. ఈ పరిస్థితుల్లో స్వామివారి వాహన సేవలు మాఢవీధుల్లో నిర్వహించే పరిస్థతి లేదన్నారు. బ్రహోత్సవాలు ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని తెలిపారు. అధిక మాసం కారణంగా రెండు సార్లు బ్రహోత్సవాలు వచ్చాయని వివరించారు. అక్టోబర్‌లో ఉత్సవాల సమయానికి కరోనా ప్రభావం తగ్గితే.. యథాతధంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.

టీటీడీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..

విజయవాడ సమీపంలోని పోరంకిలో టీటీడీ కల్యాణ మండపాన్ని నిర్మించడానికి అంగీకరించారు. తిరుమలలోని చెత్తను కంపోస్ట్‌గా మార్చి రైతులకు ఇచ్చే అంశంపైనా చర్చ జరిగింది. కొండ మీద టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయిందని దాన్ని వెంటనే తరలించాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రతీ నెల డిపాజిట్ల ద్వారా వడ్డీ వచ్చేలా బ్యాంకులో డిపాజిట్‌ చెయ్యాలని నిర్ణయించింది టీటీడీ. ఎక్కువ శాతం వడ్డీ రావడానికి బంగారం డిపాజిట్‌ 5 సంవత్సరాలకు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా పాత నోట్లు వస్తున్నాయని అధికారులు చెప్పారు. అయితే వీటిని మార్పిడికి చేయడానికి ఆర్‌బీఐతో సంప్రదింపులు చేయాలని కూడా టీటీడీ నిర్ణయించింది. బర్డ్‌ ఆస్పత్రిలో నూతన గదుల నిర్మాణానికి రూ.5.5కోట్లు, విశాఖలోని ఆలయానికి రహదారి కోసం రూ.4.5కోట్లు మంజూరు. గో సంరక్షణకు అధిక ప్రాధానం. ప్రతి ఆలయానికి ఒక ఆవు ఇవ్వాలని నిర్ణయాన్ని సమావేశంలో చర్చించారు. ఆవు ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్‌ తెలిపారు.

Next Story
Share it