ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చిన హైకోర్ట్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 8 Nov 2019 2:26 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీలో 5వేల 100 రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హై కోర్ట్ ఆదేశించింది. టీఎస్ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను అనుమతిస్తూ..కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్ట్‌లో తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరావు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం..మంత్రి వర్గ నిర్ణయాలు తమ ముందు ఉంచాలని ఆదేశించింది. పిటిషనర్ అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని అదనపు అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Next Story