తెలంగాణ సర్కార్ శుభవార్త: వెహికల్ ట్యాక్స్‌పై సంచలన నిర్ణయం
By సుభాష్ Published on 1 May 2020 2:40 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఇక అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగడంతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తొలి త్రైమాసిక మోటారు వాహన పన్ను చెల్లించని వారికి ఊరటనిచ్చింది. వాహన పన్ను చెల్లించని వారికి మరో నెల రోజుల గడువు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రైవేటు, కార్గో సర్వీసుల యజమానులకు ఊరటనిచ్చినట్లయింది. రాష్ట్రంలో బస్సులు, కార్లు, లారీలు, ఆటోలో వంటి వాణిజ్య వాహనాలు దాదాపు 4 లక్షల వరకు ఉన్నాయి. ఈ వాహన యజమానులు ప్రతీనెల మోటారు వెహికల్ పన్ను చెల్లించాలి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 30 వరకూ చెల్లించాల్సి ఉండగా, గడువు పెంచుతూ తెలంగాణ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక, ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గువుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాలు నిలిచిపోవడం వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్నామని, వాహన పన్ను చెల్లింపును వాయిదా వేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం, క్యాబ్స్ యజమానుల అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. వారి కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.