భారీగా తగ్గిన పెట్రోల్‌ ధర.. లీటర్‌పై రూ. 20 తగ్గింపు.. ఎక్కడంటే

By సుభాష్  Published on  1 May 2020 1:54 AM GMT
భారీగా తగ్గిన పెట్రోల్‌ ధర.. లీటర్‌పై రూ. 20 తగ్గింపు.. ఎక్కడంటే

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో అతలాకుతలం అవుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు మూసి ఉండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా జనాలెవ్వరు బయటకు రాలేని పరిస్థితి. లాక్‌డౌన్‌ ఉన్నా.. పెట్రోల్‌ బంక్‌లు మాత్రం తెరిచే ఉన్నాయి. అయినా అమ్మకాలు మాత్రం పూర్తిగా తగ్గిపోయాయి. వాహనదారులు ఎక్కడికి వెళ్లకపోవడంతో పెట్రోల్ పోయించుకునే వారు కరువయ్యారు.

ఈ నేపథ్యంలో పెట్రోల్‌ ధర భారీగా తగ్గాయి. అయితే ఇది మన దేశంలో కాదు.. పాకిస్థాన్‌లో. ఈ మేరకు పాకిస్థాన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌ పై రూ.20 వరకు తగ్గించింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్‌ పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లీటర్ పెట్రోల్‌పై రూ.20 తగ్గించాలని పాక్‌ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తగ్గిన ధరలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పాక్‌ ఆర్థిక శాఖ సలహాదారు డాక్టర్‌ హఫీజ్‌ షేక్‌ తెలిపారు.

వివిధ రకాలకు చెందిన ఆయిల్‌ ఉత్పత్తులను ప్రస్తుతం ఉన్న ధరల మీద 57 శాతం వరకూ తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

ఇక ధరలు తగ్గించిన తర్వాత హైస్పీడ్‌ డీజిల్‌ ధర రూ.33.94 కానుంది. పెట్రోల్‌ ధర రూ.20.68 వరకూ తగ్గింది. ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌తో చర్చలు జరిపిన తర్వాతనే పాక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాన్‌ అనే పత్రిక వెల్లడించింది.

Next Story