హైదరాబాద్: తెలంగాణ మునిసిపాలిటీలకు హైకోర్టు శుభ వార్త అందించింది. మునిసిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్ట్. అసలు ఎన్నికల ఏర్పాట్లు చట్టబద్దంగా జరగడంలేదని దాఖలు అయిన పిటిషన్‌ను హైకోర్ట్ ధర్మాసనం నిర్మోహమాటంగా కొట్టేసింది. దీంతో ..ఇప్పుడే ..హుజూర్ నగర్ ఎన్నికలు అయిపోయాయి అనుకుంటుండగానే..మళ్లీ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏర్పడింది.

తెలంగాణలో 128 మునిసిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్లు పదవీ కాలం ఇంకా పూర్తికాలేదు. దీంతో పది పట్టణాలకు ఎన్నికలు జరగనున్నాయి. మునిసిపాలిటీల్లో కూడా సిద్ధిపేట , అచ్చంపేట పదవీకాలం పూర్తికాలేదు. దీంతో 121 మునిసిపాలిటీలకు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.