తెలంగాణలో కరోనాతో 1233 మంది మృతి: వైద్య ఆరోగ్యశాఖ
By సుభాష్ Published on 13 Oct 2020 9:24 AM ISTతెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,708 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గతంలో ఉన్నట్లుగా కరోనా తీవ్రత అంతగా లేకున్నా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో
కొత్త కేసులు - 1,708
మరణాలు - 5
కోలుకున్న వారు - 2,009
రాష్ట్రంలో మొత్తం కేసులు : 2,14,792
మొత్తం మరణాలు - 1233
మొత్తం కోలుకున్నవారు - 1,89,351
రాష్ట్రంలో యాక్టివ్ కేసులు - 24,208
హొం ఐసోలేషన్లో - 19,748
రాష్ట్రంలో మరణాల రేటు - 0.57 శాతం
దేశంలో మరణాల రేటు - 1.5 శాతం
రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు - 88.15శాతం
దేశంలో కోలుకున్నవారి రేటు - 86.8 శాతం
గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు
జీహెచ్ఎంసీ - 277
మేడ్చల్ మల్కాజిగిరి - 124
రంగారెడ్డి - 137
మిగతా జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని తెలంగాణ రాష్టర్ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది.