తెలంగాణలో కొత్తగా 1269 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  12 July 2020 9:03 PM IST
తెలంగాణలో కొత్తగా 1269 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1269 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంట‌ల్లో 8 మంది మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 34671 కేసులు నమోదు కాగా, 356 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 800 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 132 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 94 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 36 కేసులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌‌ జిల్లాలో 12, క‌రీంన‌గ‌ర్‌‌ జిల్లాలో 2, ఖమ్మంలో 1, నిర్మల్‌లో 4, కరీంనగర్‌లో 23, జగిత్యాల్‌లో 4, యాదాద్రిలో 7, మహబూబాబాద్‌లో 8, పెద్దపల్లిలో 9, మంచిర్యాలలో 3, మెదక్‌లో 14, భద్రాది కొత్తగూడెం జిల్లాలో 3, నల్లొగండ జిల్లాలో 15, రాజన్న సిరిసిల్ల జిల్లాలో3, ఆదిలాబాద్‌ జిల్లాలో4, వికారాబాద్‌ జిల్లాలో 6, నాగర్‌ కర్నూలు జిల్లాలో 23, జనగాం జిల్లాలో6, నిజామాబాద్‌ జిల్లాలో 11, వనపర్తి లో15, సిద్దిపేట జిల్లాలో 3, సూర్యాపేట జిల్లాలో 7, గద్వాల్‌ జిల్లాలో 7 పాజిటివ్‌ కేసుల చొప్పున నమోదయ్యాయి.



Next Story