తెలంగాణ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల..ఈ రోజు ఎన్ని కేసులంటే..

By సుభాష్  Published on  20 Aug 2020 9:07 AM IST
తెలంగాణ కరోనా హెల్త్‌ బులిటెన్‌ విడుదల..ఈ రోజు ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1724 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 10 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 97,424కు చేరగా, మృతుల సంఖ్య 729కి చేరింది. తాజాగా 1195 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 75,186కు చేరింది. ఇక ప్రస్తుతం 21,509 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

ఇక తాజాగా నమోదైన కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలో 395, మేడ్చల్‌ 105, కరీంనగర్‌ 101, వరంగల్‌ అర్బన్‌ 91, రంగారెడ్డి 169, నల్గొండ 67, నిజామాబాద్‌, సిద్ధిపేటలలో 61 కేసులు నమోదయ్యాయి.

Ts Corona Health Bulletin

Next Story