తెలంగాణ‌లో కొత్త‌గా 56 కేసులు.. ఆ ఒక్క జిల్లాలోనే 26

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 April 2020 3:38 PM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 56 కేసులు.. ఆ ఒక్క జిల్లాలోనే 26

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. మ‌న దేశంలో కూడా ఈ మ‌హ‌మ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర‌లో మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 56 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. తాజా వాటితో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 928 కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి ఇప్ప‌టి వ‌ర‌కు 23మంది మృతి చెందారు. ఈ రోజు 8 మంది కోలుకొని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 194కి చేరింది. ఇక ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ప్ర‌స్తుతం 711 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ రోజు సూర్యాపేట జిల్లాలో 26, జీహెచ్‌ఎంసీలో 19, నిజామాబాద్‌లో 3, గద్వాలలో 2, ఆదిలాబాద్‌లో 2, ఖ‌మ్మం 1, మేడ్చ‌ల్ 1, వ‌రంగ‌ల్ 1ల‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

సూర్యాపేట జిల్లాలో 26 కేసులు..

సూర్యాపేట జిల్లాలో ఇవాళ ఒక్క‌రోజే 26 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో జిల్లాలో న‌మోదైన కేసుల సంఖ్య 80కి చేరింది. జిల్లా వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు సేక‌రించిన 796 న‌మూనాల్లో 191 మంది ఫ‌లితాలు ఇంకా రావాల్సి ఉంద‌ని డిఎంహెచ్‌వో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్ర‌భుత్వ క్వారంటైన్‌లో 210 మంది ఉండ‌గా.. 4,346 మంది హోం క్వారంటైన్‌లో ఉన్న‌ట్లు చెప్పారు.

Ts Corona Cases Update

Next Story
Share it