తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలిసిందే. ఎవ‌రైనా సాయం కోసం ట్వీట్ చేస్తే వెంట‌నే స్పందిస్తారు. ఇటీవ‌ల ఓ యువ‌కుడు కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేశాడు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ల‌ను తాను ఒక‌ప్పుడు ద్వేషించేవాడ‌ని.. కానీ ప్ర‌స్తుతం మీకు అభిమానిగా మారాన‌ని ట్వీట్ చేశాడు.

సుధీర్ అనే యువ‌కుడు మంత్రి కేటీఆర్ సోమ‌వారం ఓ ట్వీట్ చేశాడు. నేను తెలంగాణ‌కు చెందిన వాడిని కాదు. ఒక‌ప్పుడు మిమ్మ‌ల్ని, మీ నాన్న‌ను ద్వేషించేవాడిని, కానీ మీ పాల‌న చూసి అభిమానిగా మారిపోయాను. తెలంగాణే కాదు దేశం మొత్తం మీ నాయ‌క‌త్వాన్ని పొందుతుంద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను ట్వీటాడు. దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘మీలో వచ్చిన మార్పునకు అభినందనలు. మీ హృదయంలో ద్వేషం స్థానంలో అభిమానం చోటు చేసుకోవడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.


వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.