తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా మ‌రో 71కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2020 8:22 PM IST
తెలంగాణ‌లో క‌రోనా విజృంభ‌ణ‌.. కొత్త‌గా మ‌రో 71కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో కొత్త‌గా మ‌రో 71 కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలంగాణ ఆరోగ్య‌శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 1991 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 57 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల్లో 1284 మంది డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 650 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో 38 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే న‌మోదు కాగా.. రంగారెడ్డిలో 7, మేడ్చ‌ల్ 6, సూర్యాపేట‌లో 1, న‌ల్ల‌గొండ‌లో 1, వికారాబాద్‌లో 1, నారాయ‌ణ‌పేట‌లో 1 చొప్పున కేసులు న‌మోదు అయ్యాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు వ‌రంగ‌ల్‌(రూర‌ల్), యాదాద్రి భువ‌న‌గిరి, వ‌న‌ప‌ర్తి జిల్లాలో ఒక్క క‌రోనా పాజిటివ్ కేసులు కూడా న‌మోదు కాలేదు. గ‌త 14 రోజులుగా ఒక్క క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కానీ జిల్లాలు రాష్ట్రంలో 21 ఉన్నాయి.

TS corona cases rise to 1991

Next Story