తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

By సుభాష్  Published on  2 Sep 2020 3:11 AM GMT
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,892 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసులు 1,30,589 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు మరణాల సంఖ్య 846కు చేరుకుంది.

ఇక 32,341 కేసులు యాక్టివ్‌లో ఉండగా, ఇప్పటి వరకు 92,402 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.64 శాతం ఉండగా, దేశంలో 1.76 శాతం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. ఇక 25,271 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండగా చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

జిల్లాల వారీగా పాజిటివ్‌ కేసుల వివరాలు:

ఆదిలాబాద్‌ - 38

భద్రాది కొత్తగూడెం - 81

జీహెచ్‌ఎంసీ- 477

జగిత్యాల - 102

జనగామ - 43

జయశంకర్‌ భూపాలపల్లి - 21

జోగులాంబ గద్వాల - 28

కామారెడ్డి - 64

కరీంనగర్‌ - 152

ఖమ్మం - 128

కొమరంభీం - 13

మహబూబ్‌నగర్‌ - 53

మహబూబాబాద్‌ - 61

మంచిర్యాల - 83

మెదక్‌ - 32

మేడ్చల్‌ మల్కాజిగిరి - 192

ములుగు - 27

నాగర్‌ కర్నూలు - 46

నల్గొండ - 174

నారాయణపేట - 12

నిర్మల్‌ - 31

నిజామాబాద్‌ - 110

పెద్దపల్లి - 85

రాజన్న సిరిసిల్ల- -39

రంగారెడ్డి - 234

సంగారెడ్డి - 71

సిద్దిపేట - 108

సూర్యాపేట - 108

వికారాబాద్‌ - 15

వనపర్తి - 51

వరంగల్‌ రూరల్‌ - 38

వరంగల్‌ అర్బన్‌ - 116

యాదాద్రి భువనగిరి - 60

Next Story