హైదరాబాద్‌: 7 నుంచి పరుగులు పెట్టనున్న మెట్రో రైలు

By సుభాష్  Published on  2 Sep 2020 2:58 AM GMT
హైదరాబాద్‌: 7 నుంచి పరుగులు పెట్టనున్న మెట్రో రైలు

అన్‌లాక్‌ 4.0 సెప్టెంబర్‌ 1 నుంచి అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలలో భాగంగా ఈనెల 7వ తేదీ నుంచి మెట్రో రైళ్లకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగిస్తూ మిగతా ప్రాంతాల్లో అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను కేంద్ర మంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. కాగా, కేంద్రం ఇచ్చిన అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, పార్కులు, థియేటర్లకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొంన్నారు. 7వ తేదీ నుంచి మెట్రో రైలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. కంటైన్‌మెంట్‌జోన్లు మినహా మిగితా ప్రాంతాల్లో స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్స్‌ పాటిస్తూ లాక్‌డౌన్‌కు ముందు ఉన్న అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అయితే సెప్టెంబర్‌ 21 నుంచి కంటైన్‌మెంట్‌జోన్ల బయట కనీసం 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరు కావచ్చని తెలిపారు.

మార్గదర్శకాలు ఇవీ..

♦ ఆన్‌లైన్‌ క్లాసులకు అనుమతి

♦ 21 నుంచి ఆన్‌లైన్‌ టీచింగ్‌, టెలీకౌన్సిలింగ్‌, దీనికి సంబంధించిన పనులకు విద్యాసంస్థలకు ఒకే సమయంలో 50 శాతం టీచింగ్‌-నాన్‌ టీచింగ్‌ స్థాఫ్‌కు అనుమతి

♦ 21 నుంచి ఐటీఐలు, స్కిల్ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌కు, ఉన్నత విద్యాసంస్థల్లో పీహెచ్‌డీ, జీపీ టెక్నికల్‌ ప్రొగ్రాంలకు అనుమతి

♦ 21 నుంచి సోషల్‌, అకడమిక్‌, క్రీడా, వినోదం, కల్చరల్‌, రాజకీయ సమావేశాలు నిర్వహించుకోవచ్చు.

Next Story