తెలంగాణను వెంటాడుతున్న కరోనా.. ఒక్క రోజే 237 కేసులు.. జీహెచ్‌ఎంసీలో 195

By సుభాష్  Published on  15 Jun 2020 2:36 AM GMT
తెలంగాణను వెంటాడుతున్న కరోనా.. ఒక్క రోజే 237 కేసులు.. జీహెచ్‌ఎంసీలో 195

తెలంగాణలో కరోనా వైరస్‌ కాలరాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం అంతే లేకుండాపోతోంది. తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆదివారం ఒక్క రోజే 237 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 4974 కేసులు నమోదు కాగా, 185 మంది కరోనా బారిన మృత్యువాత పడ్డారు. ఇక 2377 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 2412 కేసుల యాక్టీవ్‌గా ఉన్నట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ఎక్కడ ఎన్ని కేసులు..

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ - 195

మేడ్చల్‌ - 10

రంగారెడ్డి - 8

సంగారెడ్డి - 5

వరంగల్‌ రూరల్‌ - 3

కామారెడ్డి - 2

కరీంనగర్‌ -2

నిజామాబాద్‌ - 2

మహబూబ్‌నగర్‌ -2

మెదక్‌ - 1

సిరిసిల్ల - 1

ఆదిలాబాద్‌ -1

సిద్దిపేట -1

యాదాద్రి - 1

వరంగల్‌ రూరల్‌ -1Next Story