తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..

By సుభాష్  Published on  18 Aug 2020 4:50 AM GMT
తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1682 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 93,937కు చేరింది. ఇక మృతుల సంఖ్య ఇప్పటి వరకు 711 కు చేరింది. ఇక రాష్ట్రలో 21,024 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.75 శాతం ఉండగా, దేశంలో ఇది 1.92 ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2070 మంది రికవరీ కావడం గమనార్హం.

పాజిటివ్‌ కేసుల కంటే రికవరీ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం రికవరీ కేసుల సంఖ్య 72,202 చేరుకోగా, మొత్తం తెలంగాణలో రికవరీ రేటు 76.86 శాతంగా ఉంది. దేశంలో ఇది 72.51 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,140 మంది ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19579 పరీక్షలు చేయగా, మొత్తం పరీక్షల సంఖ్య772928కి చేరింది. 560 రిపోర్టులు రావాల్సి ఉందని వివరించింది.

జిల్లాల వారీగా అధికంగా నమోదైన కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 235 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 106, రంగారెడ్డి జిల్లాలో 166, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 107 కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో వంద లోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.



Next Story