తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా పాజిటివ్‌ కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2020 3:44 AM GMT
తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులు నిత్యం 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,216 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా 11 మంది మృతి చెందినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,57,096 ఉండగా, మృతుల సంఖ్య 961కి చేరింది. రాష్ట్రంలో 31,607 కేసులు యాక్టివ్‌లో ఉండగా, గడిచిన 24 గంటల్లో కోలుకున్న వారి సంఖ్య 2,603 మంది ఉంది.

కాగా, కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక రోజు పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గితే.. మరొక రోజు కేసుల సంఖ్య పెరిగిపోతున్నారు. గతంలో హైదరాబాద్‌లో అధికంగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యేది.. ప్రస్తుతం హైదరాబాద్‌లో తగ్గుముఖం పట్టి, ఇతర జిల్లాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్ – 24

భద్రాద్రి కొత్తగూడెం- 49

జీహెచ్‌ఎంసీ -341

జగిత్యాల-56

జనగాం- 33

జయశంకర్‌ భూపాలపల్లి – 25

జోగులాంబ గద్వాల – 20

కామారెడ్డి - 45

కరీంనగర్ -119

ఖమ్మం -105

ఆసిఫాబాద్ – 24

మహబూబ్‌ నగర్ -36

మహబూబాబాద్ -64

మంచిర్యాల- 45

మెదక్ – 28

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 148

ములుగు –23

నాగర్‌కర్నూల్ – 31

నల్లగొండ – 126

నారాయణపేట -11

నిర్మల్ -28

నిజామాబాద్ – 84

పెద్దపల్లి – 52

రాజన్న సిరిసిల్ల -54

రంగారెడ్డి -210

సంగారెడ్డి -76

సిద్దిపేట – 66

సూర్యాపేట- 76

వికారాబాద్‌-24

వనపర్తి –25

వరంగల్‌ రూరల్ –24

వరంగల్‌ అర్భన్ -102

యాదాద్రి భువనగిరి - 42 కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story