తెలంగాణలో 2,579 కరోనా కేసులు
By సుభాష్ Published on 25 Aug 2020 9:08 AM ISTతెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో దూసుకుపోతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా కరోనా పై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ. గడిచిన 24 గంటల్లో 2,579 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది. ఇక కొత్తగా 9 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మృతుల సంఖ్య 770కి చేరింది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,08,670 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా 1,752 మంది కోలుకోగా, ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 84,163కు చేరింది. 23,737 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.
ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.70శాతం ఉండగా, దేశంలో మరణాల రేటు 1.85 శాతానికి చేరుకుంది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 295 కేసులు, రంగారెడ్డి 185, ఖమ్మం 161, వరంగల్ అర్బన్ 143, నిజామాబాద్ 142, నల్గొండ 129, కరీంనగర్ 116, మేడ్చల్ మల్కాజిగిరి 106, మంచిర్యాల 104 కేసులు నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వంద లోపు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.